బెయిల్‌ కోసం పీఎంఎల్‌ఏ చట్టాన్ని సవాలు చేసే ధోరణి సరికాదు: సుప్రీంకోర్టు

నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) కింద సమన్లు అందుకున్న వ్యక్తులు లేదా అరెస్టయ్యి బెయిలు కోరుతున్న వ్యక్తులు ఆ చట్ట నిబంధనల చెల్లుబాటును సవాలు చేసే ధోరణి సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది.

Published : 31 May 2023 04:32 IST

దిల్లీ: నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) కింద సమన్లు అందుకున్న వ్యక్తులు లేదా అరెస్టయ్యి బెయిలు కోరుతున్న వ్యక్తులు ఆ చట్ట నిబంధనల చెల్లుబాటును సవాలు చేసే ధోరణి సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. చట్టాన్ని సవాల్‌ చేస్తూ ఉపశమనం పొందాలని ప్రయత్నించే క్రమంలో ఇతర ప్రయోజనాలను కోల్పోయే అవకాశం ఉందని జస్టిస్‌ బేలా ఎం త్రివేది, జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర ధర్మాసనం అభిప్రాయపడింది. తమ ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాన్ని 32వ రాజ్యాంగ అధికరణం వ్యక్తులకు కల్పించింది. అయితే, పీఎంఎల్‌ఏ చట్టంలోని 15, 63 నిబంధనలను సవాల్‌ చేయడం ద్వారా పలువురు వ్యక్తులు అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఉత్తర్వులు పొందుతున్నారని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఇటువంటి వాటిని ప్రోత్సహించరాదని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వి ఓ విజ్ఞప్తి చేస్తూ...బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించేందుకు వీలుగా సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతించాలని కోరారు. ఇటువంటి పద్ధతులతో ఉన్నత న్యాయస్థానం విధులకు ఆటంకం కలిగిస్తున్నారని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు