జ్ఞానవాపి మసీదు కమిటీ అభ్యంతరాలను తోసిపుచ్చిన హైకోర్టు

ఉత్తర్‌ప్రదేశ్‌ వారణాసిలోని జ్ఞానవాపి మసీదు నిర్వహణ కమిటీకి అలహాబాద్‌ హైకోర్టులోనూ చుక్కెదురైంది.

Published : 01 Jun 2023 03:14 IST

ప్రాంగణంలో పూజలకు అనుమతి పిటిషన్‌ వ్యవహారంలో..

ప్రయాగ్‌రాజ్‌, దిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌ వారణాసిలోని జ్ఞానవాపి మసీదు నిర్వహణ కమిటీకి అలహాబాద్‌ హైకోర్టులోనూ చుక్కెదురైంది. మసీదు ప్రాంగణంలో ఉన్న హిందూ దేవతామూర్తులకు నిత్య పూజలు చేసేందుకు అనుమతినివ్వాలంటూ అయిదుగురు హిందూ మహిళలు వేసిన పిటిషన్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కమిటీ వేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది. తొలుత హిందూ మహిళలు వారణాసి జిల్లా కోర్టులో 2021 ఆగస్టులో పిటిషన్‌ వేయగా, దాని విచారణ యోగ్యతను ప్రశ్నిస్తూ మసీదు నిర్వహణ కమిటీ వ్యాజ్యం దాఖలు చేసింది. అయితే జిల్లా కోర్టు మసీదు కమిటీ పిటిషన్‌ను గత సెప్టెంబరులో తిరస్కరించింది. దీంతో కమిటీ అలహాబాద్‌ హైకోర్టులో రివిజన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. దాన్ని జస్టిస్‌ జె.జె.మునిర్‌ బుధవారం కొట్టివేశారు.

* అలహాబాద్‌ హైకోర్టు నిర్ణయంపై విశ్వ హిందూ పరిషత్‌(వీహెచ్‌పీ) హర్షం వ్యక్తం చేసింది. ‘‘హిందూ మహిళలు వేసిన పిటిషన్‌కు సాంకేతిక అడ్డంకులు తొలగిపోయాయి. ఇక ఈ పిటిషన్‌పై కోర్టు విచారణ మెరిట్‌ ప్రాతిపదికన వేగంగా సాగుతుంది. ఆఖరులో మాకు విజయం దక్కుతుంది’’ అని వీహెచ్‌పీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఆలోక్‌ కుమార్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు