మోదీతో నేడు నేపాల్‌ ప్రధాని భేటీ

నాలుగురోజుల పర్యటన నిమిత్తం నేపాల్‌ ప్రధాని పుష్పకమల్‌ దహాల్‌ ప్రచండ బుధవారం దిల్లీ చేరుకున్నారు. విదేశీ వ్యవహారాల సహాయమంత్రి మీనాక్షి లేఖి ఆయనకు స్వాగతం పలికారు.

Published : 01 Jun 2023 03:14 IST

దిల్లీ: నాలుగురోజుల పర్యటన నిమిత్తం నేపాల్‌ ప్రధాని పుష్పకమల్‌ దహాల్‌ ప్రచండ బుధవారం దిల్లీ చేరుకున్నారు. విదేశీ వ్యవహారాల సహాయమంత్రి మీనాక్షి లేఖి ఆయనకు స్వాగతం పలికారు. ఆయన నేతృత్వంలోని ప్రతినిధి బృందం గురువారం ప్రధాని మోదీతో భేటీ కానుంది. నేపాల్‌ నుంచి మిగులు విద్యుత్తు సరఫరా, వాణిజ్యం, అనుసంధానత తదితర అంశాలు చర్చకు రానున్నాయి. గత డిసెంబరులో నేపాల్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ప్రచండకు ఇదే తొలి విదేశీ ద్వైపాక్షిక పర్యటన. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితోనూ ఆయన భేటీ కానున్నారు. శుక్రవారం ఇందౌర్‌కు వెళ్లనున్న ప్రచండ.. శనివారం కాఠ్‌మాండూకు బయల్దేరతారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని