పరుగులు తీసే కారుపై ఎక్కి కసరత్తులా!

వెర్రి వేయి విధాలంటే ఇదేనేమో! రోడ్లపై ప్రమాదకర విన్యాసాలు ప్రాణాల మీదకు తెస్తున్నా కొందరిలో మార్పు రావట్లేదు. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్నవారిపై పోలీసులు తీసుకొంటున్న చర్యలకూ వారు భయపడటం లేదు.

Updated : 01 Jun 2023 03:46 IST

వెర్రి వేయి విధాలంటే ఇదేనేమో! రోడ్లపై ప్రమాదకర విన్యాసాలు ప్రాణాల మీదకు తెస్తున్నా కొందరిలో మార్పు రావట్లేదు. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్నవారిపై పోలీసులు తీసుకొంటున్న చర్యలకూ వారు భయపడటం లేదు. హరియాణాలోని గురుగ్రామ్‌లో ఓ వ్యక్తి ప్రధాన రహదారిపై పరుగు తీస్తున్న కారుపైకి ఎక్కి పుష్‌అప్స్‌ తీస్తుండగా, మరో ముగ్గురు కారు డోర్లలో నుంచి బయటకు వచ్చి చేసిన హంగామా కలకలం రేపింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి పోలీసుల దృష్టికి వెళ్లడంతో వెంటనే స్పందించారు. కారును సీజ్‌ చేసి, నిందితులను అదుపులోకి తీసుకొన్నారు. కారు యజమానికి రూ.6,500 జరిమానా విధించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు