అయోధ్య రాముడి నుదుటిపై సూర్యకిరణాలు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో శరవేగంగా కొనసాగుతున్న రామాలయ నిర్మాణంలో భాగంగా ఏటా శ్రీరామనవమి రోజున సూర్యకిరణాలు గర్భగుడిలోకి ప్రసరించేలా.. ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

Published : 01 Jun 2023 03:14 IST

తలుపుల తయారీలో హైదరాబాదీ కళాకారులు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో శరవేగంగా కొనసాగుతున్న రామాలయ నిర్మాణంలో భాగంగా ఏటా శ్రీరామనవమి రోజున సూర్యకిరణాలు గర్భగుడిలోకి ప్రసరించేలా.. ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. శాస్త్రీయంగా ఈ ప్రక్రియ జరిగేలా రామాలయ ప్రాంగణంలో నిపుణుల సాయంతో ప్రత్యేక నిర్మాణం చేపట్టనున్నారు. ఏటా శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం 12.00 గంటలకు సూర్యకిరణాలు రాముడి విగ్రహం నుదుటిపై పడతాయి. మందిర ప్రాంగణంలో ప్రయాణికుల వసతి కేంద్రాన్ని  నిర్మించనున్నారు. ప్రస్తుతం విద్యుదీకరణ పనులు చేస్తున్నారు. రెండు రోజుల కిందట నిర్మాణ పనులను పరిశీలించిన రామమందిర నిర్మాణ కమిటీ ఛైర్మన్‌ నృపేంద్ర మిశ్ర.. నవంబరు నాటికి కింది ఫ్లోరు పూర్తి చేయాలని కోరారు. ఈ ఫ్లోరులో 44 తలుపులను అమర్చనున్నారు. ఇందుకోసం మహారాష్ట్ర నుంచి భారీగా టేకు కలపను తీసుకొచ్చారు. తలుపుల తయారీకి హైదరాబాద్‌ నుంచి పది మంది కళాకారులు అయోధ్యకు చేరుకున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని