ఇస్రో హెచ్‌ఎస్‌ఎఫ్‌సీ డైరెక్టర్‌గా మోహన్‌`

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో)కు చెందిన మానవ అంతరిక్ష విమాన కేంద్రం(హెచ్‌ఎస్‌ఎఫ్‌సీ) డైరెక్టర్‌గా మోహన్‌ను నియమిస్తూ ఇస్రో అధిపతి డా. సోమనాథ్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Published : 01 Jun 2023 04:04 IST

శ్రీహరికోట, న్యూస్‌టుడే: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో)కు చెందిన మానవ అంతరిక్ష విమాన కేంద్రం(హెచ్‌ఎస్‌ఎఫ్‌సీ) డైరెక్టర్‌గా మోహన్‌ను నియమిస్తూ ఇస్రో అధిపతి డా. సోమనాథ్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు అక్కడ సంచాలకులుగా విధులు నిర్వర్తిస్తున్న ఉమామహేశ్వరన్‌ ఉద్యోగ విరమణ చేయడంతో ఆయన స్థానంలో మోహన్‌ను నియమించారు. ఆయన తిరువనంతపురంలోని విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌లో అసోసియేట్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తూ పదోన్నతి పొందారు. గగన్‌యాన్‌ ప్రాజెక్టు పనులు ఇక మోహన్‌ ఆధ్వర్యంలోనే జరగనున్నాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని