సోషల్ మీడియా యాప్‌లతో జరభద్రం
డోగేరాట్ పేరుతో కొత్త మాల్‌వేర్‌ను సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్‌ల ద్వారా యూజర్ల డివైజ్‌లలోకి హ్యాకర్లు ప్రవేశపెడుతున్నట్లు సైబర్ పరిశోధనా నిపుణులు వెల్లడించారు.
వెలుగులోకి మరో కొత్త మాల్‌వేర్
ఇంటర్నెట్ డెస్క్: డోగేరాట్ పేరుతో కొత్త మాల్‌వేర్‌ను సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్‌ల ద్వారా యూజర్ల డివైజ్‌లలోకి హ్యాకర్లు ప్రవేశపెడుతున్నట్లు సైబర్ పరిశోధనా నిపుణులు వెల్లడించారు. దీని సాయంతో ఆర్థిక, బ్యాంకింగ్, బీమా, ఈ-కామర్స్, వినోద రంగాల్లో పనిచేస్తున్న ముఖ్యమైన వ్యక్తుల డివైజ్‌లలోని సమాచారాన్ని లక్ష్యంగా ఎంచుకుంటున్నారని బెంగళూరుకు చెందిన క్లౌడ్‌సెక్ సైబర్ పరిశోధన సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్, ఇన్‌స్టాగ్రామ్, ఒపెరా మినీ, టెలిగ్రామ్ వంటి పాపులర్ ఫ్లాట్‌ఫామ్‌ల ద్వారా యూజర్ల డివైజ్‌లలోకి ఈ మాల్‌వేర్‌ను ప్రవేశపెడుతున్నారని క్లౌడ్‌సెక్ వెల్లడించింది. డోగేరాట్ డివైజ్‌లలోకి ప్రవేశించిన తర్వాత యూజర్ అనుమతి లేకుండా రిమోట్ యాక్సెస్ ద్వారా ఫోన్ కాంటాక్ట్ లిస్ట్‌లోని నంబర్లకు స్పామ్ మెసేజ్‌లు పంపడంతోపాటు నగదు చెల్లింపులు, కాల్ రికార్డింగులు వినడం, ఫొటో/వీడియోలు తీసేందుకు హ్యాకర్లకు సాయపడుతుందని తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
సల్మాన్ సినిమా ఫ్లాప్.. నన్ను చచ్చిపోమన్నారు: హీరోయిన్
-
CBFC: విశాల్ ఆరోపణలు.. సెన్సార్ బోర్డు కీలక నిర్ణయం.. అదేంటంటే?
-
Google Bard - Team India: వన్డే ప్రపంచకప్.. గూగుల్ బార్డ్ చెప్పిన భారత్ తుది జట్టు ఇదే
-
Team India Final XI: ప్రపంచకప్‌లో ఏ 11 మంది దిగితే మంచిది? మీ ఆలోచన ఏంటి?
-
Hyderabadi Biryani: హైదరాబాదీ బిర్యానీ X కరాచీ బిర్యానీ.. పాక్ ఆటగాళ్లు ఎంత రేటింగ్ ఇచ్చారంటే?
-
Viral video: లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన చిన్నారి.. 20 నిమిషాలు నరకయాతన