అహ్మద్‌నగర్‌.. ఇక అహిల్యాదేవి హోల్కర్‌

మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లా పేరును ఇకపై అహిల్యాదేవి హోల్కర్‌ జిల్లాగా మార్చి పిలవనున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే ప్రకటించారు.

Published : 01 Jun 2023 04:27 IST

 మహారాష్ట్ర సీఎం శిందే వెల్లడి

అహ్మద్‌నగర్‌: మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లా పేరును ఇకపై అహిల్యాదేవి హోల్కర్‌ జిల్లాగా మార్చి పిలవనున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే ప్రకటించారు. 18వ శతాబ్దానికి చెందిన ఇందౌర్‌ రాజ్య దిగ్గజ పాలకురాలే అహిల్యాదేవి (అహిల్యాబాయి). అహ్మద్‌నగర్‌ జిల్లాలోని అహిల్యాదేవి జన్మస్థలమైన చోండీ పట్టణంలో బుధవారం జరిగిన 298వ జయంతి కార్యక్రమంలో మాట్లాడుతూ శిందే ఈ ప్రకటన చేశారు. శిందే సర్కారు ఇదివరకే ఔరంగాబాద్‌ పేరును ఛత్రపతి సంభాజీ నగర్‌గా, ఉస్మానాబాద్‌ పేరును ధారాశివ్‌గా మార్చిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు