కొండ చరియల బీభత్సం
ఉత్తరాఖండ్‌లో భారీగా కొండ చరియలు విరిగిపడటంతో 200 మంది ఆది కైలాశ్ యాత్రికులు చిక్కుకుపోయారు.
ఉత్తరాఖండ్‌లో చిక్కుకుపోయిన 200 మంది యాత్రికులు
పితోర్‌గఢ్: ఉత్తరాఖండ్‌లో భారీగా కొండ చరియలు విరిగిపడటంతో 200 మంది ఆది కైలాశ్ యాత్రికులు చిక్కుకుపోయారు. పితోర్‌గఢ్ జిల్లాలోని నజాంగ్‌వద్ద ఈ ఘటన జరగడంతో యాత్రికులు ఎక్కడివారక్కడే నిలిచిపోవాల్సి వచ్చింది. ఆది కైలాశ్ యాత్రకు వచ్చేవారు, తిరిగి వెళ్లేవారు దార్చులా, నపాల్చు, గంజి, బుండీల్లో ఉండి పోవాల్సి వచ్చిందని దార్చులా జిల్లా మేజిస్ట్రేట్ దివేశ్ షాశ్ని గురువారం తెలిపారు. మే 30వ తేదీన జరిగిన ఘటనలో 100 మీటర్ల రోడ్డు కొట్టుకుపోయిందని వెల్లడించారు. ఈ నెల 4వ తేదీదాకా రోడ్డును తెరిచే అవకాశం లేదని ఆయన చెప్పారు. మే 4వ తేదీన ఆది కైలాశ్ యాత్ర ప్రారంభమైంది.
చార్‌ధామ్‌లోనూ..
చార్‌ధామ్ యాత్రకూ ఈసారి భక్తులు పోటెత్తుతున్నారు. వీరికీ అక్కడక్కడా కొంత అసౌకర్యం కలుగుతున్నట్లు తెలుస్తోంది. నవంబరు రెండోవారం వరకూ ఈ యాత్ర ఉంటుంది. ఈ క్రమంలో వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. అల్మోరా, చమోలీ, చంపావత్, దేహ్రాదూన్, హరిద్వార్, నైనిటాల్, రుద్రప్రయాగ, తెహ్రీ గర్వాల్, పితోర్‌గఢ్, ఉద్దమ్ సింగ్ నగర్, ఉత్తర కాశీ జిల్లాల్లో తుపాను, ఉరుములతో కూడిన వర్ష సూచనలు ఉన్నాయని పేర్కొంది. యాత్రికులంతా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని పోలీసులు సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/09/2023)
-
Air India: వేడి నీళ్లు పడి విమాన ప్రయాణికురాలికి గాయాలు.. క్షమాపణలు కోరిన ఎయిర్ఇండియా!
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Liquor policy: ఏపీలో మద్యం విధానం ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ
-
Congress: తెలంగాణలో విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్ సదుపాయం: కాంగ్రెస్
-
Vijay Antony: బాధతో జీవించడం అలవాటు చేసుకున్నా: విజయ్ ఆంటోనీ