డ్రైవింగ్‌ లైసెన్సు గడువు తీరినా పరిహారం చెల్లించాల్సిందే

ప్రమాదానికి కారణమైన వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి డ్రైవింగ్‌ లైసెన్సు గడువు ముగిసిందన్న కారణంతో బాధిత కుటుంబానికి బీమా సంస్థ పరిహారం చెల్లించనంటే కుదరదని బాంబే హైకోర్టు తీర్పు వెలువరించింది.

Published : 02 Jun 2023 03:51 IST

బీమా సంస్థకు బాంబే హైకోర్టు ఆదేశం

ముంబయి: ప్రమాదానికి కారణమైన వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి డ్రైవింగ్‌ లైసెన్సు గడువు ముగిసిందన్న కారణంతో బాధిత కుటుంబానికి బీమా సంస్థ పరిహారం చెల్లించనంటే కుదరదని బాంబే హైకోర్టు తీర్పు వెలువరించింది. లైసెన్సును గడువులోపు పునరుద్ధరించకోకపోయినంత మాత్రానా ఆ డ్రైవర్‌ నైపుణ్యం లేనివాడని చెప్పలేమని పేర్కొంది. 2011లో ట్రక్కు ఢీకొనడంతో మోటార్‌ సైకిల్‌ వెనుక సీటులో ఉన్న మహిళ ప్రాణాలను కోల్పోయింది. ఆ సమయంలో ట్రక్కుకు బీమా ఉంది. ట్రక్కును నడుపుతున్న డ్రైవర్‌ లైసెన్సు గడువు ముగిసిపోయినందున బీమాసంస్థ పరిహారం చెల్లించనక్కర్లేదని మోటార్‌ యాక్సిడెంట్స్‌ క్లైయిమ్స్‌ ట్రైబ్యునల్‌ పేర్కొంది. వాహన యజమాని మాత్రమే చెల్లించాలని ఆదేశించింది. దీనిపై బాధిత కుటుంబం హైకోర్టును ఆశ్రయించింది. ‘బీమా కంపెనీ ముందు పరిహారం చెల్లించాలి. తర్వాత వాహన యజమాని నుంచి రాబట్టుకోవాలి. ట్రైబ్యునల్‌ యాంత్రికంగా ఆదేశాలిచ్చింది’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. మృతురాలి కుటుంబానికి ఆరువారాల్లోపు పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని