సీనియర్‌ ప్రాసిక్యూటర్ల నియామకం.. ఎల్జీ ఉత్తర్వుపై సుప్రీంకు ఆప్‌ సర్కారు

పోక్సో కేసుల్లో విచారణ నిమిత్తం సీబీఐ సీనియర్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను నియమించే నోటిఫికేషన్‌ జారీ ప్రతిపాదనకు ఆమోదం తెలియజేస్తూ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వి.కె.సక్సేనా ఇచ్చిన ఆదేశాలపై ఆప్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది.

Published : 02 Jun 2023 04:43 IST

దిల్లీ: పోక్సో కేసుల్లో విచారణ నిమిత్తం సీబీఐ సీనియర్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను నియమించే నోటిఫికేషన్‌ జారీ ప్రతిపాదనకు ఆమోదం తెలియజేస్తూ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వి.కె.సక్సేనా ఇచ్చిన ఆదేశాలపై ఆప్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. ఎన్నికైన ప్రభుత్వాన్ని విస్మరించి ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వడం చట్టవిరుద్ధమనీ, సుప్రీంకోర్టు ఆదేశాలనూ దీనిద్వారా సవాల్‌ చేసినట్లవుతోందని కేజ్రీవాల్‌ ప్రభుత్వం పేర్కొంది. ముఖ్యమంత్రిని, సంబంధిత మంత్రిని విశ్వాసంలోకి తీసుకోకుండానే, పరిధి లేకుండానే ఎల్జీ ఆదేశాలు ఇస్తున్నారని ఆరోపించింది. వేర్వేరు కోర్టులో ఉన్న 20 కేసుల్లో సత్వర విచారణకు సీనియర్‌ పీపీల నియామక ప్రతిపాదనపై కేజ్రీవాల్‌ ప్రభుత్వం నెలల తరబడి కిమ్మనకుండా కూర్చొందని రాజ్‌నివాస్‌ అధికార ప్రతినిధి ప్రత్యారోపణ చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించి హోంశాఖ ద్వారా నోటిఫికేషన్‌ జారీకి ఎల్జీ ఆమోదం తెలిపారని చెప్పారు.

* అధికారుల సేవలకు సంబంధించి కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్సును కచ్చితంగా పాటించాలని దిల్లీ ప్రభుత్వం తమ ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చింది. ఎల్జీ కార్యాలయం నుంచి ప్రధాన కార్యదర్శికి వచ్చిన లేఖ ఆధారంగా ఈ ఆదేశాలు జారీ చేసింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని