విశ్వవిద్యాలయ ర్యాంకుల్లో దేశంలో అమృతకు అగ్రస్థానం

విశ్వవిద్యాలయాలకు ఇచ్చే ‘టైమ్స్‌ ఉన్నత విద్య ప్రభావ ర్యాంకులు 2023’లో కోయంబత్తూరులోని అమృత విశ్వవిద్యాపీఠం భారత్‌లో అగ్రస్థానంలో నిలిచింది.

Published : 02 Jun 2023 04:43 IST

లండన్‌: విశ్వవిద్యాలయాలకు ఇచ్చే ‘టైమ్స్‌ ఉన్నత విద్య ప్రభావ ర్యాంకులు 2023’లో కోయంబత్తూరులోని అమృత విశ్వవిద్యాపీఠం భారత్‌లో అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్త ర్యాంకుల్లో ఆస్ట్రేలియాలోని వెస్టర్న్‌ సిడ్నీ యూనివర్శిటీ తొలిస్థానంలో నిలిచింది. లండన్‌లోని మాంచెస్టర్‌ విశ్వవిద్యాలయం, కెనడాలోని క్వీన్స్‌ విశ్వవిద్యాలయం వంటివి అగ్రస్థానంలో ఉన్నాయి. ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు చేసిన ప్రయత్నాల ఆధారంగా ర్యాంకులు ప్రకటించారు. దీనిలో అమృతకు ప్రపంచంలో 52వ ర్యాంకు లభించింది. మొదటి 300 స్థానాల్లో చోటు దక్కించుకున్న భారతీయ విశ్వవిద్యాలయాల్లో లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్శిటీ (పంజాబ్‌), షూలిని బయోటెక్నాలజీ.. మేనేజ్‌మెంట్‌ సైన్సెస్‌ విశ్వవిద్యాలయం (హిమాచల్‌ప్రదేశ్‌), కేఐఐటీ విశ్వవిద్యాలయం (ఒడిశా) ఉన్నాయి. స్త్రీ-పురుష సమానత్వంలో ‘మణిపాల్‌ అకాడమీ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌’కు నాలుగో స్థానం లభించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని