IRCTC: కేటరింగ్ సేవల్లో సమూల మార్పులు: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్
ప్రయాణికులకు ఆహార, పానీయాల సరఫరా కోసం ఉద్దేశించిన కేటరింగ్ సేవల్లో సమూల మార్పులు తీసుకువస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది.

దిల్లీ: ప్రయాణికులకు ఆహార, పానీయాల సరఫరా కోసం ఉద్దేశించిన కేటరింగ్ సేవల్లో సమూల మార్పులు తీసుకు వస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. ఆయా ప్రాంతాల్లోని రుచులు, కాలానుగుణమైన వంటలను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చే స్వేచ్ఛను ఐఆర్‌సీటీసీకి ఇచ్చినట్లు తెలిపింది. పార్లమెంటు సభ్యులతో కూడిన సంప్రదింపుల కమిటీ సమావేశానికి రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గురువారం అధ్యక్షత వహించారు. కేటరింగ్, రైల్వేస్టేషన్ల అభివృద్ధిపై సమీక్షించారు.
రోజూ సగటున 1.80 కోట్ల మంది ప్రయాణిస్తున్న రైళ్లలో, స్టేషన్లలో నాణ్యమైన ఆహార లభ్యతపై అనేక సంస్కరణలు తీసుకువచ్చినట్లు ఎంపీలకు మంత్రి వివరించారు. వేర్వేరు వయోవర్గాలకు ఇష్టమైన ఆహారం అందుబాటులో ఉండేలా చేస్తున్నామని చెప్పారు. ఇ-కేటరింగ్, డిజిటల్ చెల్లింపు విధానాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. నాణ్యతపై తృతీయపక్షంతో తనిఖీలు చేయిస్తూ, ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దేశంలో 1,275 రైల్వేస్టేషన్ల అభివృద్ధి, ఉన్నతీకరణకు చేపట్టిన చర్యల్ని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Amazon Prime Video: అమెజాన్ ప్రైమ్ చందాదారులా? అయితే, ఈ విషయం తెలుసా?
-
Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ప్రభాస్‌తో పాటు ఆ స్టార్ హీరోయిన్!
-
IND vs AUS: ఆసీస్‌తో రెండో వన్డే.. శ్రేయస్ అయ్యర్‌కు ఇదేనా చివరి ఛాన్స్..?
-
Vizag: సిగరెట్ కోసం స్నేహితుడినే హతమార్చారు!
-
social look: అనుపమ ఉవాచ.. రష్మిక ఫస్ట్‌లుక్.. ఇంకా ఎన్నో ముచ్చట్లు..
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/09/2023)