కశ్మీర్‌ ఇపుడెంతో కుదుటపడింది

‘‘జమ్మూకశ్మీర్‌లో గత కొన్నేళ్లుగా పరిస్థితులు చాలా కుదుటపడ్డాయి. అయితే, ఈ ప్రాంతం నుంచి ఆర్మీ వెనక్కు మళ్లేందుకు సమయం ఇంకా ఆసన్నం కాలేదు’’ అని భారత సైన్యంలోని చినార్‌ కోర్‌ కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ ఎ.డి.ఔజలా తెలిపారు.

Published : 02 Jun 2023 04:43 IST

చినార్‌ కోర్‌ కమాండర్‌ ఎ.డి.ఔజలా

శ్రీనగర్‌: ‘‘జమ్మూకశ్మీర్‌లో గత కొన్నేళ్లుగా పరిస్థితులు చాలా కుదుటపడ్డాయి. అయితే, ఈ ప్రాంతం నుంచి ఆర్మీ వెనక్కు మళ్లేందుకు సమయం ఇంకా ఆసన్నం కాలేదు’’ అని భారత సైన్యంలోని చినార్‌ కోర్‌ కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ ఎ.డి.ఔజలా తెలిపారు. పీటీఐతో ఆయన మాట్లాడుతూ.. లోయలో ఉగ్రవాద కార్యకలాపాలు గత 34 ఏళ్లలో అతి తక్కువ స్థాయికి చేరాయన్నారు. ‘‘సైన్యం వెనక్కు మళ్లే ముందు ఇంకా కొన్ని మంచి పరిణామాలు చోటుచేసుకోవాలి. గడువు తేదీలు నేను చెప్పలేను’’ అన్నారు. ప్రభుత్వ ప్రణాళికలు అమలు చేయడమే సైన్యం బాధ్యతని చెప్పారు. 2021 నాటి కాబుల్‌ పరిణామాల తర్వాత తాలిబన్లు కశ్మీర్‌లోకి చొరబడతారన్న భయాలు కార్యరూపం దాల్చలేదని ఔజలా అన్నారు. పొరుగున ఉన్న పాకిస్థాన్‌లోనూ అంతర్గత సంక్షోభం ముదురుతున్నా కశ్మీర్‌పై దాని ప్రభావం లేదన్నారు. భద్రతా దళాలు మటుకు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాల్సిందేనని, అక్రమ చొరబాట్లు.. మాదకద్రవ్యాలు.. ఆయుధాల ప్రవేశం కట్టడికి ఇది తప్పనిసరి అన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని