వేసవి సెలవుల తర్వాతే..
గుర్తింపు, అభ్యర్థన పత్రం లేకుండా రూ.2 వేల నోట్లను బ్యాంకుల్లో మార్పిడి చేసుకోవచ్చని రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన మార్గదర్శకాలను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) అత్యవసరంగా విచారించడానికి గురువారం సుప్రీంకోర్టు తిరస్కరించింది.
గుర్తింపు పత్రం లేకుండా రూ.2 వేల నోట్ల మార్పిడిపై అత్యవసర విచారణకు సుప్రీం తిరస్కృతి
దిల్లీ: గుర్తింపు, అభ్యర్థన పత్రం లేకుండా రూ.2 వేల నోట్లను బ్యాంకుల్లో మార్పిడి చేసుకోవచ్చని రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన మార్గదర్శకాలను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) అత్యవసరంగా విచారించడానికి గురువారం సుప్రీంకోర్టు తిరస్కరించింది. వేసవి సెలవులు ముగిసిన తర్వాత ఈ పిల్‌ను ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు ఉంచాలని జస్టిస్ సుధాంశు ధూలియా, జస్టిస్ కె.వి.విశ్వనాథన్‌ల సెలవుకాలీన ధర్మాసనం పేర్కొంది. ఈ పిల్‌ను ఇప్పటికే దిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎలాంటి అభ్యర్థన పత్రం, ఆధార్ తరహా గుర్తింపు కార్డులు లేకుండా రూ.2 వేల నోట్ల మార్పిడికి అనుమతిస్తే నేరగాళ్లు, ఉగ్రవాదులు కూడా భారీస్థాయిలో అక్రమ ధనాన్ని మార్చుకొనే అవకాశం ఉందని ఉపాధ్యాయ్ పేర్కొన్నారు. తక్కువ సమయంలోనే ఇప్పటివరకు రూ.2 వేల రూపాయలను మార్చుకొని సుమారు రూ.50 వేల కోట్లను బ్యాంకుల నుంచి తీసుకున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. విచారణను ఆలస్యం చేస్తే నల్లధనమంతా బ్యాంకుల్లో మార్చుకొనే అవకాశం ఎక్కువవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.