42 ఏళ్ల వయసులో అదృశ్యమై... 33 ఏళ్ల తర్వాత ఇంటికి!

నలభై రెండేళ్ల వయసులో కనిపించకుండా పోయిన ఓ వ్యక్తి.. 75 ఏళ్ల వయసులో ఇంటికి చేరుకున్నారు.

Updated : 02 Jun 2023 04:52 IST

ఈటీవీ భారత్‌: నలభై రెండేళ్ల వయసులో కనిపించకుండా పోయిన ఓ వ్యక్తి.. 75 ఏళ్ల వయసులో ఇంటికి చేరుకున్నారు. రాజస్థాన్‌లోని అల్వార్‌ జిల్లా బన్సూర్‌ గ్రామానికి చెందిన హనుమాన్‌ సైనీ (75) 1989లో దిల్లీలోని ఓ దుకాణంలో పనికి కుదిరారు. అదే ఏడాది ఆయన ఎవరికీ చెప్పకుండా దిల్లీ నుంచి హిమాచల్‌ ప్రదేశ్‌లోని కాంగ్రాకు వెళ్లిపోయారు. అక్కడే ఉన్న మాతా మందిరంలో పూజలు చేస్తూ గడిపారు. దాదాపు 33 సంవత్సరాలు అక్కడ గడిపాక దిల్లీ వచ్చి అక్కడి నుంచి స్వగ్రామం బన్సూర్‌ చేరుకున్నారు. చాలాకాలం తర్వాత హనుమాన్‌ సైనీ ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఆనందంలో మునిగిపోయారు. అయితే ఇక ఆయన రారనుకుని గతేడాదే సైనీ మరణ ధ్రువీకరణ పత్రాన్ని వారు తీసుకోవడం గమనార్హం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు