ప్రపంచ వాతావరణ సంస్థ ఉపాధ్యక్షుడిగా మత్యుంజయ్ మహాపాత్ర
భారత వాతావరణ విభాగం (ఐఎండీ) డైరెక్టర్ జనరల్ మత్యుంజయ్ మహాపాత్ర ప్రపంచ వాతావరణ సంస్థ ముగ్గురు ఉపాధ్యక్షుల్లో ఒకరిగా గురువారం ఎన్నికయ్యారు.
దిల్లీ: భారత వాతావరణ విభాగం (ఐఎండీ) డైరెక్టర్ జనరల్ మత్యుంజయ్ మహాపాత్ర ప్రపంచ వాతావరణ సంస్థ ముగ్గురు ఉపాధ్యక్షుల్లో ఒకరిగా గురువారం ఎన్నికయ్యారు. ఐక్యరాజ్య సమితి తరఫున పనిచేసే ఈ సంస్థ వాతావరణ మార్పులు అధ్యయనం చేసి ముందస్తు హెచ్చరికలు జారీ చేయడం, విపత్తులను ఎదుర్కొనేలా సంసిద్ధం చేయడం వంటి విధులను నిర్వహిస్తుంది.
ఐరాస వాతావరణ విభాగం తొలి మహిళా అధిపతిగా అర్జెంటీనా శాస్త్రవేత్త
ఐక్యరాజ్య సమితి వాతావరణ విభాగం తొలి మహిళా అధిపతిగా అర్జెంటీనా వాతావరణ శాస్త్రవేత్త సెలెస్టె సౌలో ఎన్నికయ్యారు. సభ్య దేశాల నుంచి మూడింట రెండు వంతుల మెజారిటీ ఈమె సాధించినట్లు ప్రపంచ వాతావరణ సంస్థ గురువారం వెల్లడించింది. సౌలో అర్జెంటీనా జాతీయ వాతావరణ విభాగ డైరెక్టరుగా 2014 నుంచి సేవలందిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.