ఆ మద్యం విధానం మంచిదైతే ఎందుకు ఉపసంహరించుకున్నారు?

‘మీరు ప్రవేశపెట్టిన మద్యం విధానం అంత మంచిదైతే ఎందుకు వెనక్కి తీసుకున్నారు? దీనికి నిర్ధిష్టమైన సమాధానం ఇవ్వండి’ అని దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియాను హైకోర్టు ప్రశ్నించింది.

Updated : 02 Jun 2023 05:04 IST

మనీశ్‌ సిసోదియాను ప్రశ్నించిన దిల్లీ హైకోర్టు

దిల్లీ: ‘మీరు ప్రవేశపెట్టిన మద్యం విధానం అంత మంచిదైతే ఎందుకు వెనక్కి తీసుకున్నారు? దీనికి నిర్ధిష్టమైన సమాధానం ఇవ్వండి’ అని దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియాను హైకోర్టు ప్రశ్నించింది. దిల్లీ మద్యం కుంభకోణం కేసులో సహ నిందితుడైన విజయ్‌ నాయర్‌ బెయిల్‌ పిటిషన్‌పై గురువారం వాదనలు వింటున్న సందర్భంలో దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దినేశ్‌ కుమార్‌ శర్మ ఈ అంశాన్ని లేవనెత్తారు. దిల్లీ ఉపముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో మనీశ్‌ సిసోదియా ఎక్సైజ్‌ శాఖనూ పర్యవేక్షించారు. న్యాయమూర్తి ప్రశ్నకు   ఆప్‌ తరఫు న్యాయవాది బదులిస్తూ...‘ఖరారు కాని జోన్లలో మద్యం విక్రయ దుకాణాలకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనుమతివ్వకపోవడంతో నష్టాలు వచ్చాయ’ని తెలిపారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌(ఈడీ) తరఫున హాజరైన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌.వి.రాజు జోక్యం చేసుకుంటూ..‘మద్యం విధానంలోని     లొసుగులన్నీ బహిర్గతం కావడంతోనే ఉపసంహరించుకున్నార’ని చెప్పారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు