రెజ్లర్లకు న్యాయం జరగాల్సిందే..

బ్రిజ్‌భూషణ్‌ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్న రెజ్లర్లకు న్యాయం జరగాలని అందరూ కోరుకుంటున్నట్లు కేంద్ర క్రీడలశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ చెప్పారు.

Published : 03 Jun 2023 04:43 IST

కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌

దిల్లీ: బ్రిజ్‌భూషణ్‌ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్న రెజ్లర్లకు న్యాయం జరగాలని అందరూ కోరుకుంటున్నట్లు కేంద్ర క్రీడలశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ చెప్పారు. అయితే, న్యాయ ప్రక్రియను అనుసరించి మాత్రమే అది సాధ్యమవుతుందన్నారు. మహారాష్ట్ర భాజపా మహిళా ఎంపీ ప్రీతమ్‌ ముండే స్పందిస్తూ.. రెజ్లర్ల ఫిర్యాదును తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాల్సిందేనన్నారు. తాను ఓ భాజపా ఎంపీగా ఈ మాట చెప్పడం లేదని, సాటి మహిళగా చెబుతున్నానని ఆమె వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని