Train Accidents: దశాబ్దకాలంలో జరిగిన పెను రైలు ప్రమాదాలివీ..

హుబ్బళ్లి-బెంగళూరు హంపి ఎక్స్‌ప్రెస్‌ ఆంధ్రప్రదేశ్‌కు సమీపంలో ఓ గూడ్స్‌ రైలును ఢీ కొట్టింది.

Updated : 03 Jun 2023 07:46 IST

* 2012 మే 22: హుబ్బళ్లి-బెంగళూరు హంపి ఎక్స్‌ప్రెస్‌ ఆంధ్రప్రదేశ్‌కు సమీపంలో ఓ గూడ్స్‌ రైలును ఢీ కొట్టింది. ఇందులో 25 మంది చనిపోగా, 43 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో హంపి ఎక్స్‌ప్రెస్‌కు సంబంధించిన నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. అందులో ఒకటి మంటల్లో చిక్కుకుంది.

* 2014 మే 26: ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంత్‌ కబీర్‌ నగర్‌ ప్రాంతంలో గోరఖ్‌పుర్‌ వెళుతున్న గోరఖ్‌ధామ్‌ ఎక్స్‌ప్రెస్‌.. ఆగి ఉన్న గూడ్స్‌ రైలును ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో 25 మంది దుర్మరణం పాలయ్యారు. 50 మందికిపైగా గాయపడ్డారు.

* 2016 నవంబరు 20: ఇందౌర్‌-పట్నా ఎక్స్‌ప్రెస్‌.. కాన్పుర్‌లోని పుఖ్రాయాన్‌కు సమీపంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 150 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా.. మరో 150 మంది గాయపడ్డారు.

* 2017 ఆగస్టు 23: దిల్లీ వెళుతున్న కైఫియత్‌ ఎక్స్‌ప్రెస్‌కు సంబంధించిన 9 బోగీలు ఉత్తర్‌ప్రదేశ్‌లో పట్టాలు తప్పాయి. ఫలితంగా 70 మందికి గాయాలయ్యాయి.

* 2017 ఆగస్టు 18: పూరీ-హరిద్వార్‌ ఉత్కళ్‌ ఎక్స్‌ప్రెస్‌ ముజఫర్‌నగర్‌ వద్ద పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 23 మంది చనిపోగా, 60 గాయపడ్డారు.

* 2022 జనవరి 13: బీకానేర్‌-గువాహటి ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 12 బోగీలు పశ్చిమ బెంగాల్‌లో పట్టాలు తప్పాయి. ఈ దుర్ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. 36 మందికి గాయాలయ్యాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు