నిరుద్యోగం, అవినీతికి వ్యతిరేకంగా 1,300 కి.మీ.ల పాదయాత్ర

నాయకులు తమ పార్టీలను అధికారంలోకి తీసుకురావడం లక్ష్యంగా పాదయాత్రలు చేస్తున్న ఈ రోజుల్లో.. దేశంలో నిరుద్యోగం రూపుమాపి, అవినీతిని అరికట్టాలని కోరుతూ ఓ యువకుడు పాదయాత్రకు పూనుకున్నాడు.

Published : 03 Jun 2023 06:04 IST

నాయకులు తమ పార్టీలను అధికారంలోకి తీసుకురావడం లక్ష్యంగా పాదయాత్రలు చేస్తున్న ఈ రోజుల్లో.. దేశంలో నిరుద్యోగం రూపుమాపి, అవినీతిని అరికట్టాలని కోరుతూ ఓ యువకుడు పాదయాత్రకు పూనుకున్నాడు. భుజాలపై జాతీయ పతాకాన్ని మోస్తూ ఏకంగా 1,300 కిలోమీటర్లు నడిచాడు. రెండు నెలల క్రితం ఉత్తర్‌ప్రదేశ్‌లోని తన స్వగ్రామం కరి నుంచి బయల్దేరిన సుదేశ్‌ జాతీయ రహదారి మీదుగా దిల్లీ రాష్ట్రపతి భవన్‌కు చేరుకొన్నాడు. ఆ తర్వాత పశ్చిమబెంగాల్‌ దిశగా నడుస్తూ గురువారం ఆసన్‌సోల్‌ పట్టణానికి వచ్చాడు. ఇంకా దక్షిణేశ్వర్‌ వరకు నడిచి (మరో 200 కి.మీ.) అక్కడ కాళీమాత ఆలయాన్ని సందర్శిస్తానని సుదేశ్‌ చెబుతున్నాడు. ‘‘నేను ఓ కార్మికుణ్ని. దేశంలో ఎటుచూసినా అవినీతి పేరుకుపోయింది. ఉద్యోగాల్లేక తప్పుదారి పడుతున్న యువతను చూసి చాలాసార్లు బాధపడ్డా. నా వంతు బాధ్యతగా సమాజాన్ని మేల్కొల్పాలని ఈ పాదయాత్ర చేస్తున్నా’’ అని సుదేశ్‌కుమార్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని