ఉచిత పథకాలకు కర్ణాటక ప్రభుత్వం పచ్చజెండా

కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రకటించిన ‘అయిదు గ్యారెంటీ’లపై అధికారిక ప్రకటన చేసింది.

Published : 03 Jun 2023 08:03 IST

ఈ నెల 11 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఈనాడు, బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రకటించిన ‘అయిదు గ్యారెంటీ’లపై అధికారిక ప్రకటన చేసింది. బెంగళూరులో శుక్రవారం నిర్వహించిన తొలి మంత్రివర్గ సమావేశంలో ఈ పథకాలపై కీలకమైన తీర్మానాలు చేశారు. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే ‘మహిళా శక్తి’, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందించే ‘గృహజ్యోతి’, గృహిణికి ప్రతి నెలా రూ.2000లు సమకూర్చే గృహలక్ష్మి’, నిరుద్యోగ పట్టభద్రులకు రూ.2 వేలు అందించే యువనిధి (డిప్లొమో పట్టభద్రులకు వేరుగా రూ.1,500లు), పేదలకు ప్రతి నెలా 10 కిలోల ఉచిత బియ్యం అందించే ‘అన్నభాగ్య’ పథకాలన్నీ కొన్ని షరతులతో అమలు చేస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. ఈ పథకాలన్నీ ఈ నెల 11తో మొదలై దశలవారీగా అమలు చేస్తామన్నారు. ఇప్పటికే ఎలాంటి షరతులూ లేకుండా మహిళలంతా ఉచితంగా బస్సుల్లో ప్రయాణించే అవకాశాన్ని ఇస్తున్నట్లు ప్రకటించిన సర్కారు గృహలక్ష్మి పథకాన్ని కూడా బీపీఎల్‌, ఏపీఎల్‌ మహిళలందరికీ ఇవ్వనున్నారు. ఈ పథకాన్ని ఆగస్టు 15 నుంచి అమలు చేస్తారు. ఉచిత విద్యుత్తును ఏడాదిలో వినియోగించిన యూనిట్ల సగటు ఆధారంగా రాయితీ కల్పిస్తారు. ఈ పథకాలు అమలు చేస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుందని మాజీ ముఖ్యమంత్రులు బసవరాజ బొమ్మై, కుమారస్వామి ఆందోళన వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని