అభియోగాల ప్రతిని నిందితులకు ఇవ్వండి: దిల్లీ కోర్టు

దిల్లీ మద్యం కేసులో నిందితులైన మనీశ్‌ సిసోదియా, మరో ముగ్గురు సహనిందితులకు వారిపై మోపిన అభియోగాలు, అదనపు అభియోగాల ఛార్జిషీటుకు సంబంధించిన ప్రతులను అందజేయాలని ప్రత్యేక కోర్టు శుక్రవారం సీబీఐకి సూచించింది.

Updated : 03 Jun 2023 06:05 IST

దిల్లీ: దిల్లీ మద్యం కేసులో నిందితులైన మనీశ్‌ సిసోదియా, మరో ముగ్గురు సహనిందితులకు వారిపై మోపిన అభియోగాలు, అదనపు అభియోగాల ఛార్జిషీటుకు సంబంధించిన ప్రతులను అందజేయాలని ప్రత్యేక కోర్టు శుక్రవారం సీబీఐకి సూచించింది. మే 27న సీబీఐ అదనపు ఛార్జిషీటును దాఖలు చేయగా దిల్లీలోని ప్రత్యేక కోర్టు జడ్జి ఎం.కె.నాగ్‌పాల్‌ ఆదేశాల మేరకు శుక్రవారం సిసోదియాను వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా హాజరుపరిచారు. తదుపరి విచారణ జులై 6వ తేదీకి వాయిదాపడింది. ఈ కేసులో గోరంట్ల బుచ్చిబాబు, అమన్‌ దీప్‌సింగ్‌ ధాల్‌, అర్జున్‌ పాండే సహనిందితులుగా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని