భూమి నుంచి వింత శబ్దాలు.. వణుకుతున్న కేరళ గ్రామీణులు

కేరళలోని కొట్టాయం జిల్లా చెనప్పాడి అనే కుగ్రామంలో భూమి నుంచి భారీగా వింత శబ్దాలు వస్తుండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.

Published : 03 Jun 2023 05:26 IST

కేరళలోని కొట్టాయం జిల్లా చెనప్పాడి అనే కుగ్రామంలో భూమి నుంచి భారీగా వింత శబ్దాలు వస్తుండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున రెండుసార్లు చెవులు చిల్లులు పడేలా భారీ శబ్దాలు వినిపించినట్లు కొందరు తెలిపారు. ఈ వారం ఆరంభంలో చెనప్పాడితోపాటు చుట్టుపక్కల మరికొన్ని ప్రాంతాల్లోనూ ఇలాంటి ధ్వనులే వినిపించాయన్నారు. వాతావరణంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోకున్నా.. శబ్దాలు వినిపిస్తుండటంతో గ్రామస్థులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. కేరళ గనులు, భూగర్భశాఖ అధికారులు దీనిపై స్పందిస్తూ త్వరలో నిపుణుల బృందం ఆ ప్రాంతంలో పర్యటించి పరిశోధనలు చేస్తుందని తెలిపారు. అధ్యయనం పూర్తయిన తర్వాతే ధ్వనులపై ఓ స్పష్టత వస్తుందన్నారు. గతంలో మహారాష్ట్రలోని లాతూర్‌ జిల్లా పరిధిలో గల కొన్ని గ్రామాల్లోనూ భూగర్భం నుంచి ఇలాంటి వింత శబ్దాలు వినిపించాయి. వాటిపై నిపుణులు అధ్యయనం చేసినప్పటికీ.. వివరాలు వెల్లడి కాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని