మహాకాళేశ్వర్‌ ఆలయంలో ప్రచండ పూజలు

భారత పర్యటనలో ఉన్న నేపాల్‌ ప్రధానమంత్రి పుష్పకమల్‌ దహల్‌ ‘ప్రచండ’ శుక్రవారం మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ఉజ్జయిని నగరంలోని జ్యోతిర్లింగ క్షేత్రమైన మహాకాళేశ్వర్‌ ఆలయాన్ని సందర్శించారు.

Published : 03 Jun 2023 05:26 IST

ఉజ్జయిని: భారత పర్యటనలో ఉన్న నేపాల్‌ ప్రధానమంత్రి పుష్పకమల్‌ దహల్‌ ‘ప్రచండ’ శుక్రవారం మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ఉజ్జయిని నగరంలోని జ్యోతిర్లింగ క్షేత్రమైన మహాకాళేశ్వర్‌ ఆలయాన్ని సందర్శించారు. మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ మంగూభాయ్‌ పటేల్‌, రాష్ట్ర మంత్రులు మోహన్‌ యాదవ్‌, జగ్దీశ్‌ దేవ్‌దాలు ఆలయం వద్ద నేపాల్‌ ప్రధానికి స్వాగతం పలికారు.  మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ప్రధాన ఆలయంలో ప్రచండ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పరమశివుడికి 100 రుద్రాక్షలు, రూ.51,000 సమర్పించుకున్నారు. పూజల అనంతరం తిరిగి ఇందౌర్‌ వెళ్లారు. ఆ నగరంలో నిర్మించిన ఆసియాలోనే అతిపెద్దదైన బయో సీఎన్‌జీ కేంద్రం ‘గోబర్‌-ధన్‌’ని ప్రచండ సందర్శించారు. ఇందౌర్‌ తరహా స్వచ్ఛ కార్యక్రమాలను తమ దేశంలో అమలు చేసే అంశంపై చర్చలు జరిపారు. అనంతరం తన గౌరవార్థం ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ఏర్పాటుచేసిన విందులో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని