ప్రధాని మౌనం వైఫల్యమే

మణిపుర్‌లో నెలరోజులుగా హింస చెలరేగుతున్నా ప్రధాని మోదీ మౌనంగా ఉన్నారు.

Published : 03 Jun 2023 05:38 IST

మణిపుర్‌లో నెలరోజులుగా హింస చెలరేగుతున్నా ప్రధాని మోదీ మౌనంగా ఉన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అక్కడ అంతా బాగుందని చెబుతున్నారు. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ప్రతిష్ఠాత్మక పతకాల విజేతలు, ఈ దేశ బిడ్డలు పోరాడుతున్నా మోదీ స్పందించడం లేదు. ప్రధాని మౌనం ఆయన వైఫల్యమేనని ప్రతి భారతీయుడికీ తెలుసు.

మల్లికార్జున ఖర్గే


హిమాలయాలను కాపాడండి మోదీజీ..!

నేపాల్‌తో బంధాన్ని హిమాలయాలంత ఎత్తుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. అది మంచి ఆలోచనే. అయితే అంతకన్నా ముందు హిమాలయాలను చైనా ఆక్రమణ నుంచి కాపాడటానికి మోదీ అవసరమైన చర్యలు చేపట్టాలి. వాస్తవాధీన రేఖ వద్ద వివాద పరిష్కారానికి సంబంధించి ఇప్పటివరకూ    18 రౌండ్ల చర్చలు జరిగాయి. కానీ ఫలితం దక్కలేదు. 

కపిల్‌ సిబల్‌


చిన్నారులను చిదిమేస్తున్న యుద్ధం

రష్యా దాడుల కారణంగా ఉక్రెయిన్‌లో ఇప్పటివరకూ 535 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. మరో 1,047 మంది చిన్నారులు గాయపడ్డారు. మరోవైపు బాంబు దాడుల్లో సుమారు వెయ్యి వైద్య సేవల కేంద్రాలు ధ్వంసమయ్యాయి. ఈ హింసను తక్షణం ఆపడానికి ప్రపంచ దేశాలు చొరవ చూపాలి.

ఐరాస


జవాబు లేని ప్రశ్న లేదు

మీరు పరిష్కరించలేని సమస్యను ప్రకృతి ఎప్పటికీ మీ ముందు ఉంచదు. మీకు ఓ ప్రశ్న ఎదురైందంటే దాని సమాధానం తప్పకుండా మీ మనసులో దాగి ఉంటుంది. అయితే దాన్ని గుర్తించి సందర్భోచితంగా ఉపయోగిస్తేనే విజయం దక్కుతుంది.

శ్రీశ్రీ రవిశంకర్‌


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని