తప్పు ఎక్కడ జరిగిందంటే.. !

రైలు ప్రమాదానికి సంబంధించి ‘రైల్‌ ట్రాఫిక్‌ ఛార్ట్‌’ను అధికారులు విడుదల చేశారు. ట్రాఫిక్‌ను ట్రాక్‌ చేసేందుకు ఈ వ్యవస్థ ఉపకరిస్తుంది.

Published : 04 Jun 2023 04:16 IST

భువనేశ్వర్‌: రైలు ప్రమాదానికి సంబంధించి ‘రైల్‌ ట్రాఫిక్‌ ఛార్ట్‌’ను అధికారులు విడుదల చేశారు. ట్రాఫిక్‌ను ట్రాక్‌ చేసేందుకు ఈ వ్యవస్థ ఉపకరిస్తుంది. నాలుగు రైల్వే లైన్లు వరుసగా ఉన్నాయి. అందులో ఒకటి ‘అప్‌ మెయిన్‌’ లైన్‌. ఇందులోనే షాలిమార్‌ నుంచి చెన్నై వెళ్తున్న కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణించినట్లు రైల్వే వర్గాలు చెబుతున్నాయి. దాని పక్క లైన్‌ ‘డౌన్‌ మెయిన్‌’. బెంగళూరు-హావ్‌డా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ ఈ లైన్‌లోనే వెళ్లింది. అయితే, అప్‌మెయిన్‌ లైన్‌లో వెళ్తున్న కోరమాండల్‌ అక్కడ క్రాసింగ్‌ పాయింట్‌ ఉండటంతో పొరపాటున లూప్‌లైన్‌లోకి వచ్చేసి, అప్పటికే ఆ లైన్‌లో నిలిపి ఉన్న గూడ్స్‌ రైలును ఢీ కొట్టింది. దీంతో కోరమాండల్‌లోని కొన్ని బోగీలు పట్టాలు తప్పి పక్కనే ఉన్న ‘డౌన్‌ మెయిన్‌ లైన్‌’లోకి ఎగిరిపడ్డాయి. అదే సమయంలో వేగంగా క్రాస్‌ అవుతున్న బెంగళూరు-హావ్‌డా ఎక్స్‌ప్రెస్‌ రైలు వాటిని ఢీ కొట్టడంతో ప్రమాద తీవ్రత భారీగా పెరిగిపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని