కోర్టు అనుమతించినా.. భార్యను చూడలేకపోయిన సిసోదియా

మద్యం కుంభకోణం కేసులో అరెస్టై, తిహాడ్‌ జైల్లో ఉన్న దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆప్‌ నేత మనీశ్‌ సిసోదియాకు శనివారం నిరాశ ఎదురైంది.

Published : 04 Jun 2023 06:54 IST

దిల్లీ: మద్యం కుంభకోణం కేసులో అరెస్టై, తిహాడ్‌ జైల్లో ఉన్న దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆప్‌ నేత మనీశ్‌ సిసోదియాకు శనివారం నిరాశ ఎదురైంది. అనారోగ్యంతో ఉన్న తన భార్య సీమాను చూసేందుకు దిల్లీ హైకోర్టు అనుమతితో ఇంటికి వెళ్లిన ఆయన తన సతీమణిని కలుసుకోలేకపోయారని ఆప్‌ వర్గాలు వెల్లడించాయి. సిసోదియా ఇంటికి వెళ్లేసరికే సీమా ఆరోగ్యం క్షీణించి ఆమెను ఆసుపత్రికి తరలించడమే అందుకు కారణమని తెలిపాయి. అనంతరం సిసోదియా తిరిగి జైలుకు వెళ్లిపోయారని పేర్కొన్నాయి. ప్రస్తుతం సీమాకు ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నట్లు తెలిపాయి. అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను చూసుకునేందుకు ఆరు వారాల మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని సిసోదియా పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై శనివారం వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది. సీమా ఆర్యోగ పరిస్థితిపై ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రి నుంచి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని