Train Insurance: రూపాయి కన్నా తక్కువ చెల్లింపుతో రూ.10 లక్షల రైల్వే బీమా
ఒడిశా రైలు ప్రమాదం నేపథ్యంలో.. విపత్కర సందర్భాల్లో బాధితులకు అందే సాయం చర్చనీయాంశంగా మారింది. భారతీయ రైల్వేశాఖ ప్రతి రైలు ప్రయాణికుడికి రూ.10 లక్షల వరకు బీమా సదుపాయం కల్పిస్తోంది.
ఈటీవీ భారత్: ఒడిశా రైలు ప్రమాదం నేపథ్యంలో.. విపత్కర సందర్భాల్లో బాధితులకు అందే సాయం చర్చనీయాంశంగా మారింది. భారతీయ రైల్వేశాఖ ప్రతి రైలు ప్రయాణికుడికి రూ.10 లక్షల వరకు బీమా సదుపాయం కల్పిస్తోంది. రైలు ప్రమాదంలో మరణిస్తే లేదా శాశ్వతంగా అంగవైకల్యం ఏర్పడి మరే పని చేయలేని పరిస్థితి ఎదురైతే బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు అందిస్తారు. తీవ్రంగా గాయపడి అంగ వైకల్యం ఏర్పడినప్పుడు రూ.7.5 లక్షల వరకు బీమా సొమ్ము పొందవచ్చు. క్షతగాత్రులకు వైద్యఖర్చుల నిమిత్తం రూ.2 లక్షల వరకు అందిస్తారు. రూపాయి కన్నా తక్కువ రుసుంతోనే ఇండియన్ రైల్వేస్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఈ సదుపాయాలు కల్పిస్తుండటం విశేషం.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు : ఆన్‌లైనులో రైల్వే టికెట్లు బుక్ చేసుకునేవారికి ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని భారతీయ రైల్వేశాఖ అందిస్తోంది. ఈ విషయం తెలియక చాలామంది ప్రయాణికులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రమాదానికి గురైనప్పటికీ ఎలాంటి పరిహారం పొందలేకపోతున్నారు.
* ఆన్‌లైనులో రైల్వే టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు వెబ్‌సైట్‌లో ట్రావెల్ ఇన్సూరెన్స్ చేసుకోడానికి ఒక ‘బాక్సు’ వస్తుంది. అందులో టిక్కు పెడితే.. బీమా కోసం రూపాయి కన్నా తక్కువ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. అలా చెల్లించిన వెంటనే మీ ఫోనుకు, ఈ-మెయిల్‌కు ఒక లింకు వస్తుంది. అది బీమా కంపెనీకి సంబంధించిన లింక్. ఆ లింకు తెరిచి, నామినీ వివరాలు కచ్చితంగా పొందుపరచాల్సి ఉంటుంది. నామినీ వివరాలు అందించకపోతే, బీమా దరఖాస్తుకు వీలుపడదు.
* బీమా తీసుకున్న ప్రయాణికులు రైలు ప్రమాదంలో మరణిస్తే, వారి మృతదేహాలను స్వస్థలాలకు తీసుకువెళ్లేందుకు అయ్యే ఖర్చుల కోసం రూ.10,000 సైతం బీమా సంస్థ అందిస్తుంది.
* బీమా పొందాలంటే నామినీగా ఉన్న వ్యక్తి తగిన పత్రాలు తీసుకొని ఇన్సూరెన్స్ కంపెనీని సంప్రదించాలి. అధికారులు అన్ని పత్రాలను సరిచూసుకున్నాక నాలుగు నెలల్లోపు బాధితులకు బీమా సొమ్ము అందుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
పండగ సీజనులో కొనుగోళ్ల జోరు!
-
సంక్రాంతికి గ్రహాంతర విందు
-
Amazon Prime Video: అమెజాన్ ప్రైమ్ చందాదారులా? అయితే, ఈ విషయం తెలుసా?
-
Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ప్రభాస్‌తో పాటు ఆ స్టార్ హీరోయిన్!
-
IND vs AUS: ఆసీస్‌తో రెండో వన్డే.. శ్రేయస్ అయ్యర్‌కు ఇదేనా చివరి ఛాన్స్..?
-
Vizag: సిగరెట్ కోసం స్నేహితుడినే హతమార్చారు!