చిన్నారి అరిహాను భారత్‌కు పంపేయండి

జర్మనీలోని బెర్లిన్‌లో గత ఇరవై నెలలుగా అధికారుల సంరక్షణలో ఉన్న చిన్నారి అరిహా షా(3)ను వీలైనంత త్వరగా తల్లిదండ్రుల వద్దకు చేర్చేంచేందుకు రాజకీయ పార్టీలు ఏకమయ్యాయి.

Published : 04 Jun 2023 04:49 IST

జర్మనీ దౌత్యవేత్తకు 59 మంది ఎంపీల లేఖ

దిల్లీ: జర్మనీలోని బెర్లిన్‌లో గత ఇరవై నెలలుగా అధికారుల సంరక్షణలో ఉన్న చిన్నారి అరిహా షా(3)ను వీలైనంత త్వరగా తల్లిదండ్రుల వద్దకు చేర్చేంచేందుకు రాజకీయ పార్టీలు ఏకమయ్యాయి. 19 పార్టీలకు చెందిన 59 మంది ఎంపీలు శనివారం భారత్‌లోని జర్మనీ దౌత్యవేత్తకు లేఖ రాశారు. ‘‘అరిహాను స్వదేశానికి పంపించాలని అత్యవసర అభ్యర్థన చేస్తున్నాం. అరిహా కుటుంబం ఇప్పటికే భారత్‌కు తిరిగిరావాల్సి ఉంది. కానీ, ఈ విషాద ఘటన వల్ల వారు అక్కడే ఉంటున్నారు. మనం ఏం చేసినా ఆ చిన్నారి మెరుగైన భవిష్యత్తు కోసమే. పాప కుటుంబంలోని ఏ ఒక్కరి మీద భారత్‌లో కేసులు లేవు. ఇంతకంటే ఆలస్యం చేస్తే పాప భవిష్యత్తుకు మంచిది కాదు’’ అని లేఖలో అభ్యర్థించారు. ఈమెను అప్పగించాలంటూ పార్టీలకు అతీతంగా ఎంపీలు రాసిన లేఖపై హేమామాలిని (భాజపా), అధీర్‌ రంజన్‌ చౌధరి (కాంగ్రెస్‌), సుప్రియా సూలే (ఎన్సీపీ), కనిమొళి (డీఎంకే), మహువా మొయిత్రా (టీఎంసీ), శశి థరూర్‌ (కాంగ్రెస్‌), ఫరూఖ్‌ అబ్దుల్లా (ఎన్సీ) తదితరులు సంతకాలు చేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు