నేడు భారత్‌కు అమెరికా రక్షణ మంత్రి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వాషింగ్టన్‌ పర్యటనకు ముందు అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ రెండు రోజుల పర్యటన కోసం ఆదివారం భారత్‌ రానున్నారు.

Published : 04 Jun 2023 06:16 IST

రాజ్‌నాథ్‌తో కీలక చర్చలు జరపనున్న లాయిడ్‌

దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వాషింగ్టన్‌ పర్యటనకు ముందు అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ రెండు రోజుల పర్యటన కోసం ఆదివారం భారత్‌ రానున్నారు. బైడెన్‌తో మోదీ జరిపే చర్చల్లో రానున్న కొత్త రక్షణ సహకార ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌తో ఆస్టిన్‌ చర్చించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. రెండు వారాల తర్వాత మోదీ.. అమెరికాకు వెళ్లనున్నారు. ఫైటర్‌ జెట్‌ ఇంజిన్ల టెక్నాలజీని మన దేశంతో పంచుకోవాలని జనరల్‌ ఎలక్ట్రిక్‌ ప్రతిపాదిస్తోంది. 3 బిలియన్ల డాలర్లకు పైగా విలువైన 30 ఎంక్యూ-9బి సైనిక డ్రోన్లను జనరల్‌ ఆటమిక్స్‌ సంస్థ నుంచి కొనుగోలు చేయాలని భారత్‌ భావిస్తోంది. మరోవైపు జర్మనీ డిఫెన్స్‌ ఫెడరల్‌ మంత్రి కూడా సోమవారం 4 రోజుల పర్యటన కోసం భారత్‌లో అడుగుపెట్టనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని