భారత్‌కు 200 మంది మత్స్యకార్మికుల అప్పగింత

జైళ్ల నుంచి విడుదల చేసిన 200 మంది మత్స్యకారులను పాకిస్థాన్‌ శనివారం అట్టారీ-వాఘా సరిహద్దులోని సంయుక్త తనిఖీ కేంద్రం వద్ద బీఎస్‌ఎఫ్‌ దళాలకు అప్పగించింది.  

Published : 04 Jun 2023 06:16 IST

అమృత్‌సర్‌: జైళ్ల నుంచి విడుదల చేసిన 200 మంది మత్స్యకారులను పాకిస్థాన్‌ శనివారం అట్టారీ-వాఘా సరిహద్దులోని సంయుక్త తనిఖీ కేంద్రం వద్ద బీఎస్‌ఎఫ్‌ దళాలకు అప్పగించింది.  ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌ జారీ చేసిన ఎమర్జెన్సీ ట్రావెల్‌ సర్టిఫికెట్‌ ఆధారంగా వారంతా శనివారం వేకువజామున ఒంటి గంట ప్రాంతంలో భారత సరిహద్దులోకి ప్రవేశించారని అధికార వర్గాలు వెల్లడించాయి. అరేబియా సముద్రంలోని కాల్పనిక సరిహద్దును పడవల ద్వారా దాటి తమ జలాల్లోకి అక్రమంగా ప్రవేశించారని పాకిస్థాన్‌ వీరిని గతంలో అదుపులోకి తీసుకుంది. స్వదేశానికి వచ్చిన మత్స్యకారులు అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని