నైరుతి రాక మరింత ఆలస్యం

నైరుతి రుతుపవనాలు ముందుగా భావించినట్లు ఈ నెల 4న కేరళను తాకలేదని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) ఆదివారం ప్రకటించింది.

Published : 05 Jun 2023 04:17 IST

దిల్లీ: నైరుతి రుతుపవనాలు ముందుగా భావించినట్లు ఈ నెల 4న కేరళను తాకలేదని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) ఆదివారం ప్రకటించింది. మరో మూణ్నాలుగు రోజుల్లో తాకే అవకాశముందని వెల్లడించింది. ‘‘దక్షిణ అరేబియా సముద్రంలో పడమటి గాలులు పెరుగుతున్నందున పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. వాటి డెప్త్‌ క్రమేపీ పెరుగుతోంది. అది జూన్‌ 4న సముద్ర సగటు మట్టానికి 2.1 కిలోమీటర్లకు చేరుకుంది. ఆగ్నేయ అరేబియా సముద్రంలో మేఘాలు కూడా పెరుగుతున్నాయి. కేరళను రుతుపవనాలు తాకే అనుకూల పరిస్థితులు మెరుగవుతాయని భావిస్తున్నాం’’ అని ఐఎండీ తెలిపింది. రుతుపవనాల ఆలస్యం వానాకాలం సాగుతోపాటు దేశంలోని మొత్తం వర్షపాతంపైనా ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు