మణిపుర్‌ హింసపై విచారణకు త్రిసభ్య కమిషన్‌

మణిపుర్‌లో జరిగిన హింసపై విచారణకు కేంద్రం ఆదివారం ముగ్గురు సభ్యులతో ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసింది.

Published : 05 Jun 2023 04:17 IST

దిల్లీ: మణిపుర్‌లో జరిగిన హింసపై విచారణకు కేంద్రం ఆదివారం ముగ్గురు సభ్యులతో ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. దీనికి గువాహటి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అజయ్‌ లాంబ నేతృత్వం వహిస్తారు. ఇందులో విశ్రాంత ఐఏఎస్‌ అధికారి హిమాంశు శేఖర్‌ దాస్‌, రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి అలోక ప్రభాకర్‌ కూడా ఉంటారు. మణిపుర్‌లో హింస చెలరేగడానికి, వ్యాప్తి చెందడానికి కారణాలను ఈ కమిషన్‌ విచారిస్తుందని కేంద్ర హోంశాఖ ఒక నోటిఫికేషన్‌లో పేర్కొంది. హింస, అల్లర్లను నివారించడానికి తీసుకున్న పాలనాపరమైన చర్యలనూ విశ్లేషిస్తుంది. ఆరు నెలల్లోగా నివేదిక సమర్పించాలని కమిషన్‌కు ప్రభుత్వం సూచించింది. మే 3న ఆరంభమైన ఈ అల్లర్లలో 80 మందికిపైగా మరణించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని