క్షతగాత్రులకు అత్యుత్తమ చికిత్స అందిస్తున్నాం

ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం ఉదయం ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌కు ఫోన్‌ చేసి రైలు ప్రమాద క్షతగాత్రులకు అందుతున్న వైద్యసదుపాయాలపై  వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Published : 05 Jun 2023 04:17 IST

ప్రధానికి వివరించిన ఒడిశా సీఎం

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం ఉదయం ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌కు ఫోన్‌ చేసి రైలు ప్రమాద క్షతగాత్రులకు అందుతున్న వైద్యసదుపాయాలపై  వివరాలు అడిగి తెలుసుకున్నారు. సకాలంలో అన్నివిధాలా సహాయ సహకారాలు అందించినందుకు, పునరుద్ధరణ పనులు చేపట్టినందుకు సీఎంకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ప్రాణం తమకు విలువైందేనని, గాయపడినవారందరికీ అత్యుత్తమ చికిత్స అందిస్తున్నామని నవీన్‌ పట్నాయక్‌ ప్రధానికి వివరించారు. రైలు దుర్ఘటనలో కుటుంబ సభ్యులను కోల్పోయినవారికి రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లిస్తామని సీఎం ఆదివారం ప్రకటించారు. గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున సాయం అందజేస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని