మతం రంగు పులిమితే కఠిన చర్యలు: ఒడిశా పోలీసులు

రైలు ప్రమాదాన్ని మతంతో ముడిపెడుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు రాస్తున్న, వ్యాప్తి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆదివారం ఒడిశా పోలీసులు హెచ్చరించారు.

Published : 05 Jun 2023 05:05 IST

భువనేశ్వర్‌: రైలు ప్రమాదాన్ని మతంతో ముడిపెడుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు రాస్తున్న, వ్యాప్తి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆదివారం ఒడిశా పోలీసులు హెచ్చరించారు. ‘‘బాలేశ్వర్‌లో ప్రమాదానికి మతం రంగు పులమడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. అలాంటి నకిలీ, తప్పుడు ఉద్దేశంతో చేసిన పోస్టులను వ్యాప్తి చేయొద్దని ప్రజలకు విజ్ఞప్తిచేస్తున్నాం. విద్వేషాలను సృష్టించడానికి ప్రయత్నిస్తే..కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని ఒడిశా పోలీసులు ట్వీట్‌ చేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు