గువాహటిలో అత్యవసరంగా దిగిన ఇండిగో విమానం

అస్సాంలోని గువాహటి నుంచి దిబ్రూగఢ్‌ బయలుదేరిన ఇండిగో విమానం ఒకటి ఇంజిన్లో సమస్య తలెత్తడంతో తిరిగి గువాహటి విమానాశ్రయంలో అత్యవసరంగా దిగింది.

Published : 05 Jun 2023 05:05 IST

ప్రయాణికుల్లో కేంద్ర మంత్రి రామేశ్వర్‌ తెలీ
అస్సాంకు చెందిన ఇద్దరు భాజపా ఎమ్మెల్యేలు కూడా

దిబ్రూగఢ్‌: అస్సాంలోని గువాహటి నుంచి దిబ్రూగఢ్‌ బయలుదేరిన ఇండిగో విమానం ఒకటి ఇంజిన్లో సమస్య తలెత్తడంతో తిరిగి గువాహటి విమానాశ్రయంలో అత్యవసరంగా దిగింది. ఈ విమానంలో కేంద్ర పెట్రోలియం శాఖ సహాయమంత్రి రామేశ్వర్‌ తెలీ, అస్సాం రాష్ట్రానికి చెందిన ఇద్దరు భాజపా శాసనసభ్యులు ప్రశాంత ఫుకన్‌, తేరస్‌ గోవలాలు సహా 150 మంది ప్రయాణికులు ఉన్నారు. దిబ్రూగఢ్‌లో దిగడానికి సుమారు 20 నిమిషాల ముందు విమానాన్ని వెనక్కి మళ్లిస్తున్నట్లు ప్రకటించారని కేంద్రమంత్రి పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. ‘‘భాజపా ఎమ్మెల్యేలు ప్రశాంత, తెరస్‌ గొవలాలతో కలిసి నేను విమానంలో బయల్దేరాను. మా విమానం 15-20 నిమిషాల్లో దిబ్రూగఢ్‌లో దిగాల్సి ఉంది. కానీ, సాంకేతిక సమస్య తలెత్తడంతో తిరిగి గువాహటిలో అత్యవసరంగా ల్యాండ్‌ అయింది. మేము సురక్షితంగా ఉన్నాం. మా విమానం నేడు మరోసారి గాల్లోకి ఎగరదని విమానాశ్రయ అధికారులు చెప్పారు’’ అని రామేశ్వర్‌ వెల్లడించారు. తాను అభ్యర్థించినప్పటికీ.. ఇండిగో సిబ్బంది ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని, ఈ విషయమై పౌరవిమానయాన శాఖ మంత్రి ఫిర్యాదు చేస్తానని ఆయన స్పష్టంచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని