మూడో వ్యక్తిని అనుమతించడం వివేకం కాదు
ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేందుకు ఇద్దరి కంటే ఎక్కువ మందిని (మూడో వ్యక్తిని) అనుమతించడం వివేకవంతమైన చర్య కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది.
ద్విచక్ర వాహన ప్రయాణికుల సంఖ్యపై కేంద్రం స్పష్టీకరణ
తిరువనంతపురం: ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేందుకు ఇద్దరి కంటే ఎక్కువ మందిని (మూడో వ్యక్తిని) అనుమతించడం వివేకవంతమైన చర్య కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ప్రపంచవ్యాప్తంగా ద్విచక్ర వాహనాలు ఇద్దరు ప్రయాణించడానికే రూపొందిస్తున్నారని గుర్తు చేసింది. భారత్‌లో అమల్లో ఉన్న చట్టం కూడా ద్విచక్ర వాహనంపై ఇద్దరు ప్రయాణించడాన్నే అనుమతిస్తోందని పేర్కొంది. హెల్మెట్లు ధరించడం వంటి అవసరమైన భద్రతా చర్యలు తీసుకుని.. పదేళ్లలోపు పిల్లలను మూడో వ్యక్తిగా ద్విచక్ర వాహనాల్లో ప్రయాణించేందుకు అనుమతించాలంటూ కేరళ సీపీఎం పార్లమెంటు సభ్యుడు కరీం కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ఇటీవల ఓ లేఖ రాశారు. ఈ విజ్ఞప్తిని తిరస్కరిస్తూ గత నెల 31 కరీంకు గడ్కరీ లేఖ రాశారు. ‘‘ద్విచక్ర వాహనం నడిపే వ్యకి మూడో వ్యక్తిని తీసుకెళ్లరాదని కేంద్ర మోటారు వాహనాల చట్టం -1988 స్పష్టంచేస్తోంది’’ అని అందులో పేర్కొన్నారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణించే వారి భద్రత దృష్ట్యా... ఒక బైక్‌పై చోదకుడు, మరొకరు తప్ప ఇంకెవ్వరూ (మూడో వ్యక్తి) ప్రయాణించరాదని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Motkupalli Narasimhulu : జైలులో చంద్రబాబుకు ఏదైనా జరిగితే జగన్‌దే బాధ్యత : మోత్కుపల్లి
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Chandrababu : క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఆదేశాలను సుప్రీంలో సవాల్ చేసిన చంద్రబాబు
-
Narendra Modi: శివతత్వం ప్రతిబింబించేలా వారణాసి క్రికెట్ స్టేడియం..
-
Crime News: కుమారుడిని చంపి.. ఇంటి ముందు పడేసి: ‘మీ సింహమిదిగో’ అంటూ హేళన
-
Nani: అప్పుడే మొదటి సారి ప్రేమలో పడ్డా.. ప్రస్తుతం తనే నా క్రష్: నాని