జ్ఞానవాపి కేసు నుంచి వైదొలిగిన పిటిషన్‌దారు

జ్ఞానవాపి మసీదు కేసుకు సంబంధించి అన్ని పిటిషన్ల నుంచి స్వచ్ఛందంగా విరమించుకుంటున్నట్లు ప్రధాన పిటిషన్‌దారుల్లో ఒకరైన జితేంద్రసింగ్‌ విసేన్‌ ప్రకటించారు.

Published : 05 Jun 2023 05:05 IST

వేధింపులు ఎదురవుతున్నాయని ఆవేదన

వారణాసి: జ్ఞానవాపి మసీదు కేసుకు సంబంధించి అన్ని పిటిషన్ల నుంచి స్వచ్ఛందంగా విరమించుకుంటున్నట్లు ప్రధాన పిటిషన్‌దారుల్లో ఒకరైన జితేంద్రసింగ్‌ విసేన్‌ ప్రకటించారు. ‘నేను, నా భార్య, పిటిషన్‌ వేసిన అయిదుగు మహిళల్లో ఒకరైన నా మేనకోడలు రాఖీ సింగ్‌ జ్ఞనవాపి కేసు నుంచి తప్పుకొంటున్నాం’ అని శనివారం విడుదల చేసిన ప్రకటనలో విసేన్‌ తెలిపారు. ‘దేశం కోసం, ధర్మం కోసం ఈ పోరాటం ప్రారంభించాను. హిందువులు సహా వివిధ వర్గాల నుంచి వస్తున్న వేధింపులతో అవమానానికి గురవుతున్నాం. చూస్తుంటే ఈ ధర్మయుద్ధం మొదలుపెట్టడమే నేను చేసిన పొరపాటు అనిపిస్తోంది. మతం పేరుతో మోసం చేసేవారినే ఈ సమాజం అనుసరిస్తుంది’ అని విశ్వ వేదిక్‌ సనాతన్‌ సంఘ్‌ అధ్యక్షుడిగా ఉన్న విసేన్‌ వాపోయారు. కాగా గతంలోనే వీరి తరపున ఈ కేసుని కోర్టుల్లో వాదిస్తున్న న్యాయవాది శివం గౌర్‌ సైతం జ్ఞానవాపి కేసు నుంచి వైదొలిగారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని