28 వేల మంది జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వోద్యోగులపై ఐటీ శాఖ నిఘా

ఆదాయపు పన్ను పత్రాల్లో కోట్ల రూపాయల నకిలీ రిఫండ్లను క్లెయిమ్‌ చేసుకున్నారనే కారణంతో జమ్మూకశ్మీర్‌లో పనిచేస్తున్న 28 వేల మందికిపైగా ప్రభుత్వ ఉద్యోగులపై ఐటీ శాఖ దర్యాప్తు మొదలుపెట్టింది.

Updated : 05 Jun 2023 05:36 IST

శ్రీనగర్‌: ఆదాయపు పన్ను పత్రాల్లో కోట్ల రూపాయల నకిలీ రిఫండ్లను క్లెయిమ్‌ చేసుకున్నారనే కారణంతో జమ్మూకశ్మీర్‌లో పనిచేస్తున్న 28 వేల మందికిపైగా ప్రభుత్వ ఉద్యోగులపై ఐటీ శాఖ దర్యాప్తు మొదలుపెట్టింది. తప్పుడు రిటర్నులు సమర్పించిన వారిలో 8వేల మందికి పైగా పోలీసు, పారామిలటరీ ఉద్యోగులు ఉండటం గమనార్హం. 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో ఈ నేరం జరిగినట్లు అధికారులు గుర్తించారు. జమ్మూకశ్మీర్‌లో దాఖలు చేసిన ఐటీఆర్‌లలో అత్యధికంగా అనర్హమైన రాయితీలు ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఒక ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌, 404 మంది పన్ను సలహాదారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం ఈ మోసం విలువ రూ.16.72 కోట్లు ఉండొచ్చని తెలుస్తోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు