నెత్తుటి పట్టాలపై నలిగిపోయిన ‘ప్రేమ’

బాలేశ్వర్‌ రైలు ప్రమాదం వందలాది ప్రయాణికుల కలలను కల్లలు చేసింది. నాటి ‘కోరమాండల్‌’ బోగీలో ప్రయాణించిన ఓ బెంగాలీ తన డైరీలో రాసుకున్న ‘ప్రేమ గీతాలు’ చెల్లాచెదురైన పట్టాలపై పడున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Published : 05 Jun 2023 05:05 IST

కోల్‌కతా: బాలేశ్వర్‌ రైలు ప్రమాదం వందలాది ప్రయాణికుల కలలను కల్లలు చేసింది. నాటి ‘కోరమాండల్‌’ బోగీలో ప్రయాణించిన ఓ బెంగాలీ తన డైరీలో రాసుకున్న ‘ప్రేమ గీతాలు’ చెల్లాచెదురైన పట్టాలపై పడున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఏనుగులు, చేపల బొమ్మలు ఓ వైపు.. సూర్యుడు మరోవైపు ఉన్న ఆ చిరిగిపోయిన కాగితాలపై పడిన నెత్తుటిధారలు ఎంతోమంది ప్రయాణికుల స్వప్నాలను చిదిమేసి.. కాలగర్భంలో కలిపేసిన ఆనవాళ్లుగా మిగిలాయి. ‘చిన్ని చిన్ని మేఘాలు చిరుజల్లులను కురిపించగా.. మనం వినే చిన్ని చిన్ని కథల్లోంచే ప్రేమ కుసుమాలు విరబూస్తాయి’ అని బెంగాలీలో చేతిరాతతో రాసి ఉంది. ‘అన్నివేళలా నీ ప్రేమ కావాలి.. ఎల్లప్పుడూ నువ్వు నా మదిలోనే ఉంటావు’ అని రాసి ఉన్న కాగితాలు పదే పదే రోదిస్తున్నట్టుగా రెపరెపలాడుతున్నాయి. ఈ డైరీ ఎవరిది?.. ఆ వ్యక్తి పరిస్థితి ఏమిటనేది తెలియరాలేదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని