పర్యావరణ ఉద్యమకారుడు మనోజ్‌ మిశ్ర కన్నుమూత

ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు, ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ మాజీ అధికారి మనోజ్‌ మిశ్ర కన్నుమూశారు.

Published : 05 Jun 2023 05:05 IST

దిల్లీ: ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు, ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ మాజీ అధికారి మనోజ్‌ మిశ్ర కన్నుమూశారు. ఆయన వయసు 68 ఏళ్లు. ఈ ఏడాది ఏప్రిల్‌ 8న ఆయనకు కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఏప్రిల్‌ 10 నుంచి దానికి చికిత్స పొందుతూ.. ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. మనోజ్‌ ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురలో జన్మించారు. చిన్ననాటి నుంచే ప్రకృతిని ప్రేమించేవారు. 1979లో ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌కు ఎంపికయ్యారు. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లలో వివిధ హోదాల్లో పనిచేసి.. 2001లో స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. అడవులు, నదుల పరిరక్షణ కోసం మనోజ్‌ అలుపెరుగని కృషిచేశారు. కాలుష్యం బారి నుంచి యమునా నదిని కాపాడటమే లక్ష్యంగా 2007లో ‘యమున జియే అభియాన్‌’ను స్థాపించారు. ఆయన పోరాటం ఫలితంగానే జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) 2015లో దశలవారీగా యమునా నది పునరుజ్జీవనానికి పిలుపునిచ్చింది. మనోజ్‌ మృతి పట్ల కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌, దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వి.కె.సక్సేనా తదితర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని