Indian Railway: కొల్లం-చెన్నై ఎక్స్‌ప్రెస్‌ రైలు బోగీలో పగుళ్లు

కొల్లం-చెన్నై ఎక్స్‌ప్రెస్‌ రైలు బోగీ చక్రాల పైభాగంలో పగుళ్లు ఏర్పడటంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.

Updated : 06 Jun 2023 07:53 IST

న్యూస్‌టుడే, చెన్నై (ప్యారిస్‌): కొల్లం-చెన్నై ఎక్స్‌ప్రెస్‌ రైలు బోగీ చక్రాల పైభాగంలో పగుళ్లు ఏర్పడటంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. కేరళ రాష్ట్రం కొల్లం నుంచి చెన్నై ఎగ్మూర్‌ వెళ్లే కొల్లం-చెన్నై ఎక్స్‌ప్రెస్‌ రైలు సోమవారం సెంగోట్టై రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. ఎప్పటిలాగానే స్టేషన్‌లో రైల్వే సిబ్బంది బండిని పరిశీలించారు. ఎస్‌-3 బోగీ చక్రాల పైభాగంలో పగుళ్లు కనిపించడంతో ఉన్నతాధికారులకు తెలియజేశారు. అనంతరం ఆ బోగీని తొలగించి అందులో ఉన్న ప్రయాణికులను వేరేచోట సర్దుబాటు చేశారు. దీంతో సుమారు గంట ఆలస్యంగా రైలు బయలుదేరింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని