సిసోదియాకు బెయిలు నిరాకరణ
మద్యం పాలసీ మనీ లాండరింగ్ కేసులో దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోదియాకు దిల్లీ హైకోర్టు బెయిలు నిరాకరించింది.
ఈనాడు, దిల్లీ: మద్యం పాలసీ మనీ లాండరింగ్ కేసులో దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోదియాకు దిల్లీ హైకోర్టు బెయిలు నిరాకరించింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను చూసేందుకు బెయిలు ఇవ్వాలన్న ఆయన అభ్యర్థనను సోమవారం తోసిపుచ్చింది. అయితే కస్డడీలో ఉండే ఒక రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ఆయన తన భార్యను పరామర్శించడానికి జస్టిస్ దినేశ్ కుమార్ శర్మ అనుమతించారు. సిసోదియాపై తీవ్ర ఆరోపణలున్నాయని, బెయిలిస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశముందనే ఆందోళనలున్నాయని కోర్టు అభిప్రాయపడింది. అందువల్ల 6 వారాల మధ్యంతర బెయిలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. సిసోదియా భార్య ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి నుంచి కోర్టు నివేదిక తెప్పించుకుంది. అంతేకాకుండా ఎయిమ్స్ వైద్యుల బోర్డుతో ఆమె పరిస్థితిని సమీక్షించి మెరుగైన వైద్యం అందించాలని సూచించింది. మద్యం పాలసీ కేసులో ఫిబ్రవరి 26న సీబీఐ, మనీ లాండరింగ్ కేసులో మార్చి 9న ఈడీ సిసోదియాను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
ISRO: విక్రమ్, ప్రజ్ఞాన్‌లతో కమ్యూనికేషన్‌కు యత్నం.. ఇస్రో ఏం చెప్పిందంటే!
-
Anantapuram: పాఠశాలలో దారుణం.. పుట్టిన రోజు నాడే చిన్నారి మృతి
-
Jagadish Reddy: సూర్యాపేటలో 26న ఐటీ జాబ్ మేళా: జగదీశ్‌రెడ్డి
-
Mayawati: బీఎస్పీ ఎంపీపై భాజపా ఎంపీ అభ్యంతరకర వ్యాఖ్యలు... మాయావతి రియాక్షన్ ఇదే!
-
Sidharth Luthra: సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా మరో ట్వీట్
-
Nene Naa Movie ott: ఓటీటీలోకి వచ్చేసిన రెజీనా మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?