గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీకి జీవితఖైదు

ఉత్తర్‌ప్రదేశ్‌ రాజకీయ నేత, గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీకి ఓ హత్య కేసులో వారణాసి ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు సోమవారం జీవిత ఖైదు విధించింది.

Published : 06 Jun 2023 04:07 IST

32 ఏళ్ల నాటి హత్య కేసులో దోషిగా వారణాసి కోర్టు తీర్పు

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌ రాజకీయ నేత, గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీకి ఓ హత్య కేసులో వారణాసి ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు సోమవారం జీవిత ఖైదు విధించింది. రూ.1.20 లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. 1991లో కాంగ్రెస్‌ నేత అజయ్‌రాయ్‌ సోదరుడు అవధేశ్‌ రాయ్‌ను అన్సారీ.. అతని అనుచరులు కాల్చి చంపారు. ఆ సమయంలో అజిత్‌ రాయ్‌ కూడా అక్కడే ఉన్నారు. ‘‘కరడుగట్టిన నేరగాడికి వ్యతిరేకంగా మేం జరిపిన 32 ఏళ్ల పోరాటానికి ఇది ముగింపు’’ అని తీర్పు వెలువడిన అనంతరం అజిత్‌ రాయ్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం అన్సారీ.. బందా జైలులో ఉన్నారు. అక్కడి నుంచే ఆయన కోర్టు విచారణలో పాల్గొన్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన ముఖ్తార్‌పై వివిధ రాష్ట్రాల్లో 61 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. ఆరు కేసుల్లో శిక్ష పడింది. గత 9 నెలల్లో ఈ ముస్లిం నేతకిది ఐదో శిక్ష. ఏప్రిల్‌లోనే గాజీపుర్‌ కోర్టు.. భాజపా ఎమ్మెల్యే కృష్ణానంద్‌ రాయ్‌ హత్య కేసు(2007)లో పదేళ్ల జైలుశిక్ష విధించింది. 1996 నుంచి అన్సారీ ఐదు సార్లు యూపీలోని మవ్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నెగ్గారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని