రైల్వేల భద్రతకు రూ.లక్ష కోట్ల వ్యయం!

రైల్వేల భద్రత కోసం 2017 నుంచి 2022 వరకు రూ.లక్ష కోట్లు ఖర్చు చేసినట్లు అధికారిక పత్రాలద్వారా వెల్లడైంది. భద్రతలో భాగంగా పట్టాల నవీకరణలో క్రమానుగత అభివృద్ధి సాధిస్తున్నామని అందులో ఉంది.

Published : 06 Jun 2023 05:02 IST

2017-22 మధ్య ఖర్చు చేసినట్లు అధికారిక పత్రాలద్వారా వెల్లడి

దిల్లీ: రైల్వేల భద్రత కోసం 2017 నుంచి 2022 వరకు రూ.లక్ష కోట్లు ఖర్చు చేసినట్లు అధికారిక పత్రాలద్వారా వెల్లడైంది. భద్రతలో భాగంగా పట్టాల నవీకరణలో క్రమానుగత అభివృద్ధి సాధిస్తున్నామని అందులో ఉంది. దీనిపై త్వరలో కాగ్‌కు రైల్వేశాఖ సమాధానం ఇవ్వనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఒడిశా రైలు ప్రమాదం నేపథ్యంలో రైల్వేల భద్రతా వ్యయంపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రధానికి లేఖ రాయడంతో అధికారిక పత్రాన్ని ప్రభుత్వ వర్గాలు విడుదల చేశాయి. 2017-18లో పట్టాల నవీకరణకు రూ.8,884 కోట్లను ఖర్చు చేయగా.. 2021-22 నాటికి అది 16,558 కోట్లకు పెరిగిందని అందులో ఉంది. 2017-2022 మధ్య పట్టాల నవీకరణకు రూ.58,045 కోట్లు ఖర్చు చేసినట్లు ఉంది. 2022 డిసెంబరు 21న ‘పట్టాలు తప్పుతున్న భారతీయ రైల్వే’ అనే 22వ నంబరు రిపోర్టును పార్లమెంటు ముందు కాగ్‌ ఉంచింది. అయితే ఇందులో పాక్షిక వివరాలే ఉన్నాయని పేర్కొంటూ త్వరలో కాగ్‌కు ప్రభుత్వం సమాధానం పంపనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని