సిగరెట్లు తాగొద్దన్నందుకు గొడవ.. రణరంగంగా మారిన యూనివర్సిటీ

పొగ తాగొద్దన్నందుకు ఏకంగా విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని విద్యార్థులు రణరంగంగా మార్చేశారు. ఈ ఘటన నోయిడాలోని గౌతమ్‌ బుద్ధ ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో ఆదివారం రాత్రి చోటు చేసుకొంది.

Updated : 06 Jun 2023 05:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పొగ తాగొద్దన్నందుకు ఏకంగా విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని విద్యార్థులు రణరంగంగా మార్చేశారు. ఈ ఘటన నోయిడాలోని గౌతమ్‌ బుద్ధ ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో ఆదివారం రాత్రి చోటు చేసుకొంది. పోలీసులు 33 మంది గార్డులు, విద్యార్థులను అదుపులోకి తీసుకొన్నారు. ‘‘విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని మున్షీ ప్రేమ్‌ చంద్‌ వసతిగృహం లోపల కొందరు విద్యార్థులు ధూమపానం చేస్తున్నారు. అక్కడి సెక్యూరిటీ గార్డులు దీనికి అభ్యంతరం తెలపడంతో వివాదం మొదలైంది. రాత్రి 10.30 గంటల సమయంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని.. ఘర్షణగా మారింది. సమాచారం అందుకొన్న పోలీసు బృందాలు అక్కడికి చేరుకొని 33 మందిని అదుపులోకి తీసుకొన్నాయి. ఇరు వర్గాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకొన్నాయి. ఈ ఘర్షణపై దర్యాప్తు చేస్తున్నాం’’ అని పోలీస్‌ శాఖ ప్రతినిది తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు