ఒడిశాలో పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

ఒడిశాలోని బర్గఢ్‌ జిల్లాలో ఓ గూడ్స్‌ రైలు సోమవారం ఉదయం పట్టాలు తప్పింది. సున్నపు రాయి లోడుతో వెళుతున్న ఈ రైలు సంబర్‌ధార వద్ద ప్రమాదానికి గురైంది.

Published : 06 Jun 2023 05:02 IST

దిల్లీ: ఒడిశాలోని బర్గఢ్‌ జిల్లాలో ఓ గూడ్స్‌ రైలు సోమవారం ఉదయం పట్టాలు తప్పింది. సున్నపు రాయి లోడుతో వెళుతున్న ఈ రైలు సంబర్‌ధార వద్ద ప్రమాదానికి గురైంది. ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. ఈ రైలు బర్గఢ్‌ నుంచి దుంగ్రీ ప్రాంతానికి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకొంది. ఏసీసీ సిమెంట్‌ కర్మాగారంలో సున్నపురాయి గనుల నుంచి ప్లాంట్‌కు లోడు తీసుకెళుతుండగా ప్రైవేటు నేరో గేజ్‌ పట్టాలపై అయిదు బోగీలు పట్టాలు తప్పాయని అధికారులు వెల్లడించారు. ఈ రైలును ప్రైవేటు సంస్థ నిర్వహిస్తోందని, దానికి భారతీయ రైల్వేలతో సంబంధంలేదని వివరించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు