Secunderabad-Agartala Express: సికింద్రాబాద్‌ - అగర్తలా రైలులో షార్ట్‌ సర్క్యూట్‌

ఎక్స్‌ప్రెస్‌ రైలులోని ఒక బోగీలో షార్ట్‌సర్క్యూట్‌ అయిన ఘటన ఒడిశాలోని గంజాం జిల్లా బ్రహ్మపుర వద్ద జరిగింది.

Updated : 07 Jun 2023 08:15 IST

ఒడిశాలో ఘటన

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: ఎక్స్‌ప్రెస్‌ రైలులోని ఒక బోగీలో షార్ట్‌సర్క్యూట్‌ అయిన ఘటన ఒడిశాలోని గంజాం జిల్లా బ్రహ్మపుర వద్ద జరిగింది. మంగళవారం మధ్యాహ్నం సికింద్రాబాద్‌ - అగర్తలా ఎక్స్‌ప్రెస్‌ బ్రహ్మపుర సమీపంలోకి రాగానే బీ-5 బోగీలో షార్ట్‌సర్క్యూట్‌ జరిగి దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. తీవ్ర భయాందోళనకు గురైన ప్రయాణికులు బ్రహ్మపుర స్టేషన్‌లో దిగిపోయారు. బాలేశ్వర్‌లో జరిగిన రైళ్ల ప్రమాదాన్ని ప్రస్తావిస్తూ.. బోగీ మార్చాల్సిందేనని డిమాండ్‌ చేశారు. రైల్వే అధికారులు చేరుకుని నచ్చజెప్పడంతో శాంతించారు. ముందు జాగ్రత్తగా ఏసీ మెకానిక్‌, ఆర్పీఎఫ్‌ సిబ్బంది అదే బోగీలో వెళ్లారు. దీని వల్ల స్టేషన్‌లో రైలు సుమారు 55 నిమిషాలు నిలిచిపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని