విద్యార్థులకు స్ఫూర్తి కేంద్రంగా మోదీ బడి

గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో ప్రధాని మోదీ తన ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన 19వ శతాబ్దంనాటి పాఠశాలను ఆధునికీకరించారు.

Published : 07 Jun 2023 03:56 IST

19వ శతాబ్దంనాటి పాఠశాల ఆధునికీకరణ

దిల్లీ: గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో ప్రధాని మోదీ తన ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన 19వ శతాబ్దంనాటి పాఠశాలను ఆధునికీకరించారు. ప్రేరణ పథకం కింద దానిని అభివృద్ధి చేసి విద్యార్థులకు స్ఫూర్తి కేంద్రంగా తీర్చిదిద్దారు. జాతీయ పురావస్తు సంస్థ రూపొందించిన 19 శతాబ్దంనాటి నిర్మాణ శైలితో దానిని అభివృద్ధి చేసినట్లు మంగళవారం దిల్లీలో అధికారులు తెలిపారు. ప్రధాని మోదీ దార్శనికతకు అనుగుణంగా తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. 2500 ఏళ్లనాటి వాద్‌నగర్‌ చారిత్రక వారసత్వానికి అనుగుణంగా పునరభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది ఆఖరులో దీనిని ప్రారంభించి దేశవ్యాప్తంగా విద్యార్థులను తీసుకొచ్చి స్ఫూర్తి నింపేలా శిక్షణ ఇస్తామని వివరించారు. ప్రతి జిల్లా నుంచి ఇద్దరు విద్యార్థులు వస్తారని, బ్యాచ్‌కు 30 మంది ఉంటారని, దేశంలోని 750 జిల్లాల నుంచి విద్యార్థులను తీసుకొస్తామని తెలిపారు. వారానికి ఒక బ్యాచ్‌ చొప్పున దీనికి మొత్తం 50 వారాల సమయం పడుతుందని చెప్పారు. అది భవిష్యత్తును నిర్మించే పాఠశాలగా ఉంటుందని, ఇది రెసిడెన్షియల్‌ అని, వ్యయాన్నంతా కేంద్రం భరిస్తుందని తెలిపారు. ‘ఇక్కడ శిక్షణ పొందే పిల్లలకు 21 మంది పరమవీర్‌ చక్ర అవార్డులు పొందినవారి గాథలతో పరాక్రమ పాఠాలను బోధిస్తారు. బుద్ధుని జీవిత చరిత్రద్వారా జీవనం, వారసత్వ గొప్పదనంపై పాఠాలు చెబుతారు’ అని అధికారులు వివరించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు